బాలీవుడ్ నటి మమతా కులకర్ణిపై రెడ్ కార్నర్ నోటీసుల జారీకి రంగం సిద్ధం
- రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని ఇంటర్ పోల్ ను కోరిన సీబీఐ
- నేడో, రేపో నోటీసులు జారీ అయ్యే అవకాశం
- అండర్ గ్రౌండ్ లో మమత సహచరుడు విక్కీ గోస్వామి
తాజాగా, సెప్టెంబర్ 29న ఆమెపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా ముంబై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ, నేడో రేపో మమతకు నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం మమత కెన్యాలో ఉంది. ఆమె సహచరుడు గోస్వామి అమెరికాలో అండర్ గ్రౌండ్ లో వున్నట్టు సమాచారం. గతంలో కూడా డ్రగ్స్ కేసులో మమత కెన్యాలో అరెస్టయి, విడుదలయింది. సోలాపూర్ కేసులో ఇద్దరు నైజీరియన్లు సహా 14 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.