ట్రయినీ కానిస్టేబుల్ నవీన మృతి వెనుక 'మోసం చేసిన ప్రియుడు'!

  • నవీన డైరీని స్వాధీనం చేసుకున్న పోలీసులు
  • ప్రియుడు మోసం చేస్తున్నాడని వాపోయిన నవీన
  • ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని భావిస్తున్న పోలీసులు
కానిస్టేబుల్ గా రాజ్ బహదూర్ వెంకట్రామిరెడ్డి శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందుతున్న నవీన అనే యువతి అనుమానాస్పద మరణం వెనుక విఫలమైన ప్రేమ కథ ఉందని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఆమె గది నుంచి నవీన డైరీని స్వాధీనం చేసుకున్నారు. ఈ డైరీలో నవీన రాసుకున్న వివరాల ప్రకారం, ప్రియుడు నవీనను మోసం చేసినట్టు తెలుస్తోంది.

తాను మరెవరినీ ప్రేమించ లేదని, నన్నెందుకు మోసం చేస్తున్నావని ప్రియుడిని ప్రశ్నించిన నవీన, "నువ్వే నా ప్రాణం, నా లైఫ్ అనుకున్నా. కానీ, నన్ను ఎంత మోసం చేశావు. నీకు నచ్చిన లైఫ్ నే నువ్వు అనుభవించు" అని రాసుకుంది. అతని పేరు మధుగా తెలుస్తుండగా, మధు ఎవరన్న విషయమై పోలీసులు కూపీ లాగుతున్నారు. 
Go Back to Shorts
naveena
nalgonda
trainee constable

More Telugu News