వైభవంగా జరిగిన నాగచైతన్య, సమంతల హిందూ వివాహం.. సాయంత్రం క్రైస్తవ సంప్రదాయ వెడ్డింగ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వైభవంగా జరిగిన నాగచైతన్య, సమంతల హిందూ వివాహం.. సాయంత్రం క్రైస్తవ సంప్రదాయ వెడ్డింగ్!

  • సమంత క్రిస్టియన్ కావడంతో ఆమె మనోభావాలకు కూడా విలువ
  • నేటి సాయంత్రం క్రైస్తవ సంప్రదాయంలో వివాహం
  • పూర్తయిన ఏర్పాట్లు.. క్రేసా వెడ్డింగ్ గౌన్ లో మెరవనున్న సమంత
టాలీవుడ్ అందాల ప్రేమజంట నాగచైతన్య, సమంతలు మూడుముళ్ల బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. గోవాలోని వెగాటర్ బీచ్ లోని డబ్ల్యూ హోటల్ లో పూర్తి తెలుగు హిందూ సంప్రదాయం ప్రకారం పచ్చని తోరణాలు, వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, ఆత్మీయుల ఆనందోత్సాహాల నడుమ వారి వివాహం ఘనంగా జరిగింది.

 అయితే, సమంత క్రిస్టియన్ కావడంతో ఆమె మనోభావాలకు కూడా విలువనిస్తూ నేటి సాయంత్రం క్రైస్తవ సంప్రదాయంలో కూడా వివాహం నిర్వహిస్తున్నారు. ఈ వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వివాహంలో క్రేసా వెడ్డింగ్ గౌన్ ను సమంత ధరించనున్నట్టు తెలుస్తోంది. వివాహం అనంతరం వెడ్డింగ్ డిన్నర్ ఉంటుంది. ఈ రెండు వివాహాల్లో వంద మంది అతిథులు పాలుపంచుకుంటున్నారు. 
samanta
naga chitanya
marriage
goa

More Telugu News