ఎక్కడ పడితే అక్కడ టాటూలు వేయించుకోకూడదనడానికి ఆమె కన్ను 'ఊదా'హరణ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎక్కడ పడితే అక్కడ టాటూలు వేయించుకోకూడదనడానికి ఆమె కన్ను 'ఊదా'హరణ!

  • కంట్లో టాటూ వేయించుకున్న కాట్ గాలింగర్
  • కంట్లోంచి కారుతున్న ఊదారంగు ద్రవం
  • కన్ను బాగుపడుతుందో లేదోనని ఆందోళన చెందుతున్న యువతి
టాటూలు ఫ్యాషన్ కు ప్రతీకలు. ఫ్యాషన్ ను గుడ్డిగా అనుకరించేవారు తమ శరీర భాగాలపై రకరకాలుగా టాటూలు వేయించుకుంటున్నారు. అలాంటి వారందరికీ కెనడాకు చెందిన కాట్‌ గాలింగర్‌ ఒక సూచన చేస్తోంది. గాలింగర్ కు టాటూలంటే చాలా ఇష్టం. దీంతో ఆమె ఒంటిపై రకరకాల టాటూలు వేయించుకుంది. అందరిలా ఒంటిపైన వేయించుకుంటే ప్రత్యేకత ఏముందని భావించిన గాలింగర్, కాస్త వెరైటీగా కంట్లో టాటూ వేయించుకుని తన ప్రత్యేకత చూపాలని భావించింది.

దీంతో తన కుడికంటి తెల్లగుడ్డుపై ‘ఐ బాల్‌’ పేరిట ఊదా రంగు టాటూ వేయించుకుంది. అంతే.. ఆమె చేసిన పని ఆమె కొంపముంచింది. టాటూ వేయించుకున్న నాటి నుంచి ఊదా రంగు నీరు ఆమె కంటి నుంచి కారడం మొదలైంది. కన్నువాచిపోయింది. దీంతో భయపడ్డ ఆమె వైద్యులను ఆశ్రయించింది. కంటి కార్నియా దెబ్బతిందని, సర్జరీ చేయకతప్పదని డాక్టర్లు సెలవిచ్చారు. సర్జరీ తరువాత తన పరిస్థితి మెరుగవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తూ, యువతకు సోషల్ మీడియా ద్వారా సందేశమిస్తూ, టాటూలపై మోజుతో పిచ్చిపనులు చేయవద్దని సూచిస్తోంది. తాను చేసిన పిచ్చిపని తనకు చాలా సమస్యగా మారిందని ఆమె చెబుతోంది. ఈ మేరకు తన పరిస్థితిని ఫోటోల ద్వారా ఫేస్ బుక్ లో వివరించింది. 
Catt Gallinger
tattoo in eye
eye damage

More Telugu News