నేడే చై, శామ్ ల వివాహ వేడుక... గోవా చేరిన స్టార్ సినీ కుటుంబాలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేడే చై, శామ్ ల వివాహ వేడుక... గోవా చేరిన స్టార్ సినీ కుటుంబాలు!

  • గోవాలోని వెగాటర్ బీచ్ లోని డబ్ల్యూ హోటల్ లో టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ వెడ్డింగ్ 
  • ఈ రోజు తెలుగు హిందూ సంప్రదాయ పధ్ధతిలో వివాహం
  • రేపు క్రైస్తవ సంప్రదాయంలో వివాహం
టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ మ్యారేజ్ గోవాలోని వెగాటర్ బీచ్ లోని డబ్ల్యూ హోటల్ లో నేడు జరగనుంది. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో హిందూ, సంప్రదాయ పద్ధతుల్లో జరగనున్న వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెండు ప్రత్యేక విమానాల్లో అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలు తరలి వెళ్లాయి. సమంత కుటుంబ సభ్యులు కూడా నిన్న సాయంత్రానికే వేదికకు చేరుకున్నారు. నాగచైతన్య, సమంతల సన్నిహితులు కూడా అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో నేటి మధ్యాహ్నం 3 గంటలకు మెహందీ వేడుక ప్రారంభం కానుంది. 6 గంటలకు ఈ వేడుక పూర్తికాగా, రాత్రి 8 గంటలకు విందు భోజనం ప్రారంభం కానుంది. రాత్రి 11.52 నిమిషాలకు పూర్తి తెలుగు హిందూ సంప్రదాయ పధ్ధతిలో వివాహం జరుగుతుంది. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు విందు భోజనం జరగనుంది. సాయంత్రం 5:30 గంటలకు క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహం.. ఆ తరువాత డిన్నర్, పార్టీ వుంటాయి. 
samanta
naga chitanya
marriage
goa

More Telugu News