సినిమా రంగానికి రాకుంటే కంగనా నిన్ను `అంకుల్` అని పిలిచేది: హృతిక్ మీద మండిపడ్డ కంగనా చెల్లి
- నువ్వే కంగనా వెంట పడ్డావ్
- `అంకుల్` వెంట పడాల్సిన అవసరం కంగనాకు లేదు
- ట్వీట్ల వర్షం కురిపించిన రోలి రనౌత్
`నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ఇంత కన్నా ఉత్తమ పని కనిపించలేదా? ఎప్పటిలాగే మళ్లీ ఈ-మెయిళ్ల చిట్టా బయటికి తీశావ్! నీ మొదటి సినిమా విడుదలైనపుడు కంగనా స్కూల్లో చదువుకుంటోంది. ఒకవేళ తాను సినీ పరిశ్రమకి వచ్చి ఉండకపోతే నిన్ను ఇప్పుడు `అంకుల్` అని పిలిచేది. అందం, డబ్బు ఉన్న కంగనా లాంటి అమ్మాయి నీ లాంటి అంకుల్ వెనక ఎందుకు పడుతుంది? నువ్వే తన వెంట పడ్డావ్! ఇప్పటికీ తన వెంట పడుతూనే ఉన్నావ్. ఈ విషయం గురించి కంగనా పట్టించుకోవడం మానేసింది. నువ్వు కూడా వదిలేసి నీ పిల్లలు, భార్య మీద దృష్టి సారించు` అని రోలీ ట్వీట్లు చేసింది.