'సైరా'కు రెహమాన్ గుడ్ బై చెప్పేసినట్టేనా?

  •  సెట్స్ పైకి వెళ్లే పనుల్లో 'సైరా నరసింహా రెడ్డి'
  •  సంగీత దర్శకుడిగా రెహ్మాన్ ఎంపిక
  •  తీరిక లేదని చెప్పిన రెహ్మాన్
  •  ఇతర ప్రాజక్టులతో బిజీ  
చిరంజీవి 151వ సినిమాగా 'సైరా నరసింహా రెడ్డి' సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. చరణ్ నిర్మాణంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా తమన్ ను తీసుకుందామని అనుకున్నారు. వివిధ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలనే నిర్ణయానికి రావడంతో, జాతీయస్థాయి మార్కెట్ కోసం ఎ.ఆర్. రెహమాన్ ను ఎంపిక చేసుకున్నారు.

 అయితే రెహమాన్ ఈ సినిమా చేస్తున్నాడా? లేదా? అనే విషయంలో కొన్ని రోజులుగా ఎలాంటి స్పష్టత లేకుండా పోయింది. ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టేననేది తాజా సమాచారం. సహజంగానే రెహ్మాన్ ఏ ప్రాజెక్టుకైనా ఎక్కువ సమయాన్ని తీసుకుంటూ ఉంటాడు. అందువల్లనే తక్కువ సినిమాలను అంగీకరిస్తూ ఉంటాడు. ఇంతకుముందే ఆయన 'బ్రూస్ లీ' బయోపిక్ కు సైన్ చేయడం వలన, 'సైరా'కు చేయలేనని చెప్పినట్టు సమాచారం.
Go Back to Shorts
chiranjeevi
nayanatara

More Telugu News