Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'అజ్ఞాతవాసి' టైటిల్ నే ఫిక్స్ చేసే ఛాన్స్!

  •  షూటింగ్ దశలో పవన్ - త్రివిక్రమ్ మూవీ
  •  కథకి తగిన టైటిల్స్ పరిశీలన
  •  'అజ్ఞాతవాసి' టైటిల్ వైపు మొగ్గు చూపుతోన్న యూనిట్
  •  దీపావళికి టైటిల్ ను ఎనౌన్స్ చేసే ఛాన్స్         
త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ కథానాయకుడిగా ఒక సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. త్రివిక్రమ్ తన సినిమాల టైటిల్స్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటారు. అందువల్లనే పవన్ సినిమా టైటిల్ విషయంలో కథకి తగిన వివిధ రకాల టైటిల్స్ ను పరిశీలిస్తూనే వున్నారు.

 దేవుడే దిగి వచ్చినా .. గోకుల కృష్ణుడు .. మాధవుడు .. ఇంజనీర్ బాబు .. అజ్ఞాత వాసి అనే టైటిల్స్  పరిశీలనలో వున్నట్టుగా వార్తలు వచ్చాయి. చివరికి 'అజ్ఞాతవాసి' టైటిల్ నే ఖాయం చేసే ఛాన్స్ ఉందనేది తాజా సమాచారం. యూనిట్ సభ్యులంతా ఈ టైటిల్ వైపే మొగ్గుచూపుతున్నారట. అయితే 'అజ్ఞాతవాసి' అనే టైటిల్ సామాన్య ప్రేక్షకులకు అర్థంకాకపోవచ్చనీ, 'ఇంజనీర్ బాబు' అయితే జనంలోకి బాగా పోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. దీపావళికి టైటిల్ ను ఎనౌన్స్ చేసే ఛాన్స్  ఉందంటూ సమాచారం.          
pavan
keerthi

More Telugu News