నైజామ్ లో దుమ్మురేపేసిన ' జై లవ కుశ'
- తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోన్న 'జై లవ కుశ' జోరు
- ముఖ్యంగా నైజామ్ లో అత్యధిక వసూళ్లు
- ఇంతవరకూ అక్కడ 15 కోట్ల షేర్ వసూలు
- ఖుషీ అవుతోన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్
ముఖ్యంగా నైజామ్ లో ఈ సినిమా వసూళ్ల పరంగా దుమ్మురేపేస్తోంది. ఇంతవరకూ ఈ సినిమా అక్కడ 15 కోట్ల షేర్ ను వసూలు చేయడం విశేషం. ఎన్టీఆర్ కెరియర్లోనే నైజామ్ లో ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన సినిమా ఇదేనని అంటున్నారు. ఈ ఏడాది అత్యధిక వసూళ్లను సాధించిన తెలుగు చిత్రాల జాబితాలో ఈ సినిమాకి మూడవ స్థానం దక్కడం పట్ల ఎన్టీఆర్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తదుపరి చిత్రం కోసం త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ సెట్స్ పైకి వెళ్లే ఆనందకరమైన క్షణాల కోసం వాళ్లంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.