ఏమి దుస్థితి?... ఆన్ లైన్ వేధింపుల్లో మనమే నెంబర్ వన్!
- ఆన్ లైన్ వేధింపుల్లో ఆసియా ఫసిఫిక్ దేశాల్లో భారత్ నెంబర్ వన్
- సర్వే నిర్వహించిన నార్టన్ సిమాంటెక్ సంస్థ
- 1035 మందిపై సర్వే
- ప్రతి పదిమందిలో 8 మంది వేధింపుల బారినపడ్డవారే
నార్టన్ సిమాంటెక్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసియా పసిఫిక్ దేశాల్లో కెల్లా ఆన్ లైన్ వేధింపులు జరిపే దేశాల్లో భారత్ అగ్రస్థానం సాధించింది. ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాల కంటే కూడా భారత్ లో ఆన్ లైన్ వేధింపులు ఎక్కువగా ఉండడం విశేషం. భారత్ లో 1,035 మంది ఈ సర్వేలో పాల్గొనగా ప్రతి 10 మందిలో 8 మంది తాము ఆన్ లైన్ వేధింపులకు గురైనట్లు వెల్లడించడం విశేషం.