అమెజాన్ లో నేటి నుంచి ప్రారంభమైన భారీ ఆఫర్లు.. వివరాలు!
- ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ ప్రారంభం
- ఎలక్ట్రానిక్స్, పర్సనల్ కేర్, బేబీ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు
- 100 రకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు
- 160 మోడళ్ల స్మార్ట్ఫోన్లు
గతంలో అందించిన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కన్నా అధికంగా ఆఫర్లు అందిస్తోంది. రూ.26వేల తగ్గింపుతో గూగుల్ పిక్సల్ ఎక్స్ఎల్ 128 జీబీ ఫోన్ ను రూ.49,999కే అందుకోవచ్చు. రూ.9వేల తగ్గింపుతో యాపిల్ ఐఫోన్ 7 (32జీబీ) ను రూ.39,999కే పొందవచ్చు. అంతేగాక, అన్ని రకాల స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. బ్యూటీ ఉత్పత్తులు, బేబీ కేర్ ఉత్పత్తులపై కూడా డిస్కౌంట్లు అందుకోవచ్చు.
ఇందులో భాగంగా 100 కన్నా ఎక్కువ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై డిస్కౌంట్లు అందిస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. అలాగే 160 రకాల మోడళ్ల స్మార్ట్ఫోన్లను డిస్కౌంట్లతో అందిస్తున్నట్లు చెప్పింది. ఆగస్టు 23, 2017న భారత మార్కెట్లో విడుదలైన నోకియా 6 స్మార్ట్‌ఫోన్‌ని కూడా అందుకోవచ్చని పేర్కొంది. పూర్తి వివరాల కోసం అమెజాన్ వెబ్ సైట్ చూడొచ్చు.