నా కొడుకు అలా ఎందుకు చేశాడో: సింగర్ ఉదిత్ నారాయణ్
- రాయపూర్ విమానాశ్రయంలో వీరంగం సృష్టించిన ఆదిత్య నారాయణ్
- డ్యూటీ మేనేజర్ ను అసభ్య పదజాలంతో దూషించిన ఉదిత్
- సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో
- తన కొడుకు మంచి వాడని కితాబిచ్చిన ఉదిత్
కాగా, రాయపూర్ నుంచి ముంబైకి ఐదుగురితో కలసి ఇండిగో విమానంలో టికెట్ బుక్ చేసుకున్న ఆదిత్య, 40 కిలోల అదనపు లగేజ్ ని తీసుకురాగా, దానికి రూ. 13 వేలు చెల్లించాలని బోర్డింగ్ పాస్ ఇస్తున్న యువతి కోరిన వేళ, ఈ గొడవ జరిగినట్టు తెలుస్తోంది. తానో అమ్మాయితో మాట్లాడుతున్నానని, జరుగుతున్న ఘటనను వీడియో తీస్తున్నారన్న విషయాలను మరచిపోయిన ఆదిత్య, ఆ అమ్మాయిపై, అక్కడి ఇండిగో అధికారులపై రెచ్చిపోయాడు. డ్యూటీ మేనేజర్ ను అసభ్య పదజాలంతో దూషించాడు. తాను రూ. 10 వేల కన్నా ఎక్కువ చెల్లించేది లేదని తేల్చి చెబుతూ వేలు చూపించి మాట్లాడాడు. బిగ్గరగా కేకలు వేశాడు. ఆపై అతన్ని ప్రయాణానికి అనుమతించేది లేదని ఇండిగో స్పష్టం చేయగా, ఆదిత్య, అక్కడి ఉద్యోగులకు క్షమాపణలు చెప్పాడు.