125 కోట్లతో .. ఆల్ టైమ్ హయ్యెస్ట్ గ్రాసర్ జాబితాలో 'జై లవ కుశ'
- కొనసాగుతోన్న 'జై లవకుశ' జోరు
- ఇంతవరకూ 125 కోట్ల గ్రాస్ వసూలు
- ఈ ఏడాది ఈ స్థాయి వసూళ్లు సాధించిన 3వ సినిమా ఇది
- ఎన్టీఆర్ కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిన సినిమా
ఈ ఏడాది ఈ స్థాయి వసూళ్లను సాధించిన 3వ సినిమాగా నిలిచింది. ఈ సినిమాకి ముందు 'బాహుబలి 2' .. 'ఖైదీ నెంబర్ 150' వున్నాయి. ఇక తెలుగులో ఆల్ టైమ్ హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచిన చిత్రాల్లో 'జై లవ కుశ' 8వ స్థానాన్ని సంపాదించుకుంది. మొదటి ఏడు స్థానాల్లో బాహుబలి .. బాహుబలి 2 .. ఖైదీ నెంబర్ 150 .. శ్రీమంతుడు .. జనతా గ్యారేజ్ .. అత్తారింటికి దారేది .. సరైనోడు సినిమాలు వున్నాయి. మొత్తానికి ఎన్టీఆర్ మూడు పాత్రలను పోషించిన ఈ సినిమా, ఆయన కెరియర్లో ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.