అమెరికాలో మా వాళ్లున్నారు... మరిన్ని దాడులు జరుపుతాం: ఐఎస్ఐఎస్ ప్రకటన
- పెడాక్ ను ఇస్లాంలోకి మార్చి, జీహాద్ పట్ల ఆకర్షితుణ్ణి చేశాం
- పెడాక్ మావాడేనంటూ మరోసారి ప్రకటన
- మరిన్ని దాడులకు అమెరికా సిద్ధంగా వుండాలి
ఈ మేరకు తమ సైనికులు పని చేస్తున్నారని ఐఎస్ఐఎస్ వెల్లడించింది. పెడాక్ ను కొద్దినెలల క్రితమే ఇస్లాంలోకి మార్చామని, తరువాత జీహాద్ పట్ల ఆకర్షితుణ్ణి చేశామని అల్ బతార్ మీడియా ఫౌండేషన్ విడుదల చేసిన వీడియోలో ఐఎస్ఐఎస్ తెలిపింది. మరిన్ని దాడులకు ప్రణాళిక సిద్ధం చేశామని, అందుకు అమెరికా సిద్ధంగా ఉండాలని సూచించారు. కాగా, లాస్ వెగాస్ లో నరమేధానికి పాల్పడిన పెడాక్ (64) కు ఉగ్రవాద సంస్థలతో ఎలాంటి సంబంధాలు లేవని ఎఫ్బీఐ స్పష్టం చేసింది.