ఓబీసీ వ‌ర్గీక‌ర‌ణ క‌మిష‌న్‌కు నేతృత్వం వ‌హించనున్న జ‌స్టిస్ జి. రోహిణి

  • ఐదుగురు స‌భ్యుల క‌మిష‌న్‌కి నాయ‌క‌త్వం
  • నియమించిన రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌
  • ఓబీసీ రిజ‌ర్వేష‌న్ల అమ‌లులో అస‌మాన‌త‌ల తొల‌గింపే ల‌క్ష్యం
ఓబీసీ కులాల్లో రిజ‌ర్వేష‌న్ల అమ‌లులో త‌లెత్తుతున్న అస‌మాన‌త‌లు తొల‌గించే ఉద్దేశంతో వారిలో బాగా వెనుక‌బ‌డిన కులాల‌ను గుర్తించి వ‌ర్గీక‌ర‌ణ చేసే అంశంపై రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఓ క‌మిష‌న్‌ను నియ‌మించారు. ఐదుగురు స‌భ్యులు ఉన్న ఈ క‌మిష‌న్ నాయ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను తెలుగు రాష్ట్రానికి చెందిన ఢిల్లీ హైకోర్టు విశ్రాంత ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ జి. రోహిణికి ఆయ‌న అప్ప‌గించారు. ఈ కమిష‌న్‌కి కార్య‌ద‌ర్శిగా కేంద్ర సామాజిక న్యాయం-సాధికార‌త శాఖ సంయుక్త కార్య‌ద‌ర్శి వ్య‌వ‌హరించనున్నారు.

ఓబీసీ కులాల్లో బాగా వెనుకబడిన ఓబీసీలకు విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రయోజనాలు లభించేందుకు వర్గీకరణ అవ‌స‌ర‌మ‌ని కేంద్ర సామాజిక న్యాయం - సాధికార‌త మంత్రిత్వ శాఖ పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. రిజర్వేషన్ అమ‌ల్లో అసమానతల గురించి, వాటిని నివారించేందుకు వ‌ర్గీక‌ర‌ణ ఎలా ఉప‌యోగ‌ప‌డ‌నుంద‌నే అంశాల గురించి, అందుకు కావాల్సిన యంత్రాంగం గురించి ఈ కమిషన్ అధ్య‌య‌నం చేయ‌నుంది. ఛైర్‌పర్సన్‌ బాధ్యతలు చేపట్టిననాటి నుంచి 12 వారాల్లో కమిషన్‌ తమ నివేదికను రాష్ట్రపతికి సమర్పించాల్సి ఉంటుంది.
Go Back to Shorts
obc
seperation
segregation
commission
ram nath kovind
president
rohini

More Telugu News