శ్రీనగర్ విమానాశ్రయం సమీపంలో ఉగ్రదాడి.. ముగ్గురు జవాన్లకు గాయాలు
- ఈ తెల్లవారుజామున దాడికి దిగిన ఉగ్రవాదులు
- కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతం
తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో బీఎస్ఎఫ్ 182 బెటాలియన్ క్యాంపులోకి చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. భద్రతా దళాలు వారిని నిలువరించడంతో క్యాంపస్‌లోని ఓ భవనంలోకి ప్రవేశించిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారభించారు. జవాన్లు కూడా దీటుగా స్పందిస్తూ, కాల్పులు జరుపుతున్నారు. ఉగ్రదాడి కారణంగా ఎయిర్‌పోర్టు వైపు వాహనాలను, వ్యక్తులను అనుమతించడం లేదు.