Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లాస్ వెగాస్ కాల్పులకు 45 నిమిషాల ముందే... మీరంతా చనిపోబోతున్నారంటూ హెచ్చరించిన మహిళ

  • పుట్టిన రోజు వేడుకలకు మాండలే బే రిసార్ట్ కు వెళ్లిన బ్రియాన్నా హెండ్రిక్స్
  • వేడుకల సందడిలో ఉండగా రిసార్ట్ కు చేరిన ఒక జంట
  • అందరి జట్టు లాగుతూ పిచ్చిగా వ్యవహరించిన మహిళ
  • హెచ్చరికలు పట్టించుకోని బ్రియాన్నా
లాస్‌ వెగాస్‌ కాల్పులకు 45 నిమిషాల ముందు ఈ కాల్పులపై ఒక మహిళ హెచ్చరించిందని, దానిని తాము పట్టించుకోలేదని బ్రియాన్నా హెండ్రిక్స్ అనే యువతి పేర్కొంది. తన 21వ పుట్టినరోజు జరుపుకునేందుకు బ్రియాన్నా తన స్నేహితులతో కలిసి లాస్ వెగాస్ లోని మాండలే బే రిసార్ట్ కు వెళ్లింది. అక్కడ పుట్టినరోజు వేడుకల సందడిలో ఉండగా, ఒక జంట అక్కడికి వచ్చింది.

అందులోని మహిళ పిచ్చిగా వ్యవహరిస్తూ అందరినీ జుట్టు పట్టుకుని లాగిందని తెలిపింది. అంతే కాకుండా 'వాళ్లంతా మన చుట్టూ ఉన్నారు. మీరంతా ఈ రోజు చనిపోబోతున్నారు' అని గట్టిగా అరుచుకుంటూ ముందుకు వెళ్లిపోయిందని గుర్తుచేసుకుంది. అయితే ఆమె వ్యవహారశైలి చూసిన తాము పిచ్చిది అనుకుని వదిలేశామని తెలిపింది. 
lasvegas
Mandalay Bay Casino
gun fire

More Telugu News