సచిన్ మొదటి వీడియో ఇంటర్వ్యూ ఇదిగో .... చేసింది టామ్ ఆల్టర్!
- అప్పుడు సచిన్ వయసు 15 ఏళ్లు
- శుక్రవారం మరణించిన టామ్
- గుర్తు చేసుకున్న క్రికెటర్లు
80-90ల్లో స్పోర్ట్స్ జర్నలిస్టుగా పనిచేసిన ఆయన సచిన్ టెండూల్కర్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఓ టీవీ ఛానల్ కోసం సచిన్‌ను ఇంటర్వ్యూ చేసిన మొదటి వ్యక్తి టామ్ ఆల్టర్. అప్పటికి సచిన్‌కి 15 ఏళ్లే. ఇంకా భారత్ తరఫున ఆడలేదు. గుజరాత్ జట్టుతో జరిగిన రంజీ మ్యాచ్‌లో ముంబై జట్టు తరఫున ఆడిన సచిన్ సెంచరీ చేశాడు. దీంతో ఆ తర్వాత వెస్టిండీస్‌తో జరగాల్సిన మ్యాచ్‌లో ఆడటానికి సచిన్‌కు భారత జట్టులో చోటు కల్పించాలని క్రికెట్ పెద్దలు యోచించారు. ఆ సమయంలో టామ్ ఈ ఇంటర్వ్యూ చేశారు. ఆయన మరణానికి సంతాపంగా చాలా మంది క్రికెటర్లు ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.