మ్యాన్ ఆఫ్ ద సిరీస్ పాండ్యాకే.. అతడు ఎటువంటి ఆటగాడో చెప్పిన కోహ్లీ
- టీమిండియాకు పాండ్యా పెద్ద ఆస్తి అన్న కెప్టెన్
- భువీ, బుమ్రాలపైనా ప్రశంసలు
హార్దిక్ పాండ్యా జట్టుకు గొప్ప ఆస్తిగా మారాడని కితాబిచ్చాడు. జట్టులోకి ఆటగాళ్లను ఎంపిక చేసే ప్రతిసారి తనకు తలనొప్పిగా ఉంటుందని, జట్టులో అందరూ మంచి ఆటగాళ్లనే తీసుకోవాల్సి ఉంటుందని తెలిపాడు. బౌలర్లు భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రాలను కూడా కోహ్లీ ఆకాశానికెత్తేశాడు. ఈ సిరీస్లో వారు చక్కని ప్రదర్శన కనబరిచారని కొనియాడాడు. ద్వైపాక్షిక సిరీస్లలో వరుసగా ఆరో సిరీస్ విజయాన్ని నమోదు చేయడం ఆనందంగా ఉందని కోహ్లీ చెప్పాడు. జట్టు ప్రదర్శన సంతృప్తికరంగా ఉందన్నాడు.