హీరోయిన్ పై శివాలెత్తిన శింబు తండ్రి... కన్నీటి పర్యంతమైన హీరోయిన్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హీరోయిన్ పై శివాలెత్తిన శింబు తండ్రి... కన్నీటి పర్యంతమైన హీరోయిన్!

  • ‘విళితిరు’ సినిమాలో హీరోయిన్ గా నటించిన ధన్షిక
  • తనపేరు ప్రస్తావించలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన నటుడు, దర్శకుడు టి. రాజేందర్
  • మీడియా సాక్షిగా ధన్షికకు చీవాట్లు పెట్టిన రాజేందర్
  • స్టేజ్ పై కన్నీటి పర్యంతమైన ధన్షిక
కోలీవుడ్ లో మరోసారి ప్రముఖ నటుడు, దర్శకుడు టి. రాజేందర్ వివాదానికి కేంద్రమయ్యారు. మీడియా సాక్షిగా హీరోయిన్ పై శివాలెత్తిపోయారు. ఘటన వివరాల్లోకి వెళ్తే... ‘విళితిరు’ సినిమాలో ధన్షిక హీరోయిన్ గా నటించింది. చిత్ర నిర్మాతలు తాజాగా ఈ సినిమా మీడియా సమావేశాన్ని నిర్వహించారు. అందులో పని చేసిన అందరి గురించి ప్రస్తావించిన ధన్షిక... రాజేందర్ పేరు ప్రస్తావించడం మాత్రం మరచిపోయింది. దీనిని అవమానంగా భావించిన ఆయన వేదికపైనే ఆమెకు చీవాట్లు పెట్టారు.

రజినీకాంత్‌ తో కబాలి సినిమాలో నటించినంత మాత్రాన స్టార్ హీరోయిన్లు అయిపోరని, పెద్దలను గౌరవించాలని హితవు పలికారు. సహచర ఆర్టిస్టులకు మర్యాద ఇవ్వడం నేర్చుకోవాలని సూచించారు. పెద్ద ఆర్టిస్టులను గౌరవించడం నేర్చుకోకపోతే భవిష్యత్‌ ఉండదని హెచ్చరించారు.

దీంతో షాక్ తిన్న ధన్షిక వెంటనే తను చేసిన పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూ, స్టేజ్ పై ప్రసంగించడం తనకు అలవాటు లేదని చెప్పింది. అందువల్లే పొరపాటు జరిగింది తప్ప తను కావాలని చేసింది కాదని తెలిపింది. అయినా సరే ఆయన పట్టించుకోకుండా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అప్సెట్ అయిన ధన్షిక కన్నీటిపర్యంతమైంది. ఇంతకీ ఈ సినిమాలో టి.రాజేందర్ నటించలేదు... కేవలం ఒక పాట మాత్రమే పాడారు. అందుకే, ఆయనను మీడియా సమావేశానికి ఆహ్వానించారు. 
dhanshika
t.rajendar
vilitiru
movie press meet

More Telugu News