ప్రియుడి కోసం చేయకూడని పని చేసిన యువతి... ఆపై భయంతో ఆత్మహత్య చేసుకున్న జంట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రియుడి కోసం చేయకూడని పని చేసిన యువతి... ఆపై భయంతో ఆత్మహత్య చేసుకున్న జంట!

  • స్నేహితురాళ్ల నగ్న దృశ్యాలు సేకరించిన యువతి
  • వాటిని ప్రియుడికి పంపిన వైనం
  • విషయం వెలుగులోకి రావడంతో ఆత్మహత్య!
తను వలచిన వాడు కోరాడు కదా అని చెయ్యకూడని పని చేసిన ఓ యువతి, భయంతో ప్రియుడితో కలసి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహారాష్ట్రలో కలకలం రేపింది. థానే జిల్లా కల్యాణ్ పట్టణంలో జరిగిన ఘటన పూర్వపరాల్లోకి వెళితే, హాస్టల్ లో ఉంటూ, సెయింట్‌ జార్జ్‌ ఆసుపత్రిలో నర్సుగా శిక్షణ పొందుతున్న 21 సంవత్సరాల వృశాలి లండే మేల్ నర్సుగా పని చేస్తున్న సురేశ్‌ తో ప్రేమలో ఉంది.

అతని కోరిక మేరకు హాస్టల్ రూమ్ మేట్స్ నగ్న చిత్రాలను తీసి సురేశ్‌ కు పంపి పెద్ద తప్పే చేసింది. ఈ నేపథ్యంలో వృశాలీ సెల్ ఫోన్ లో సురేష్ తో జరిగిన చాటింగ్ ను చూసిన ఓ హాస్టల్ రూమ్మేట్, మొత్తం విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. సురేశ్‌ బలవంతం చేయడంతో తానాపని చేశానని చెప్పడంతో, ఆ మేరకు కాగితం రాయించుకున్న స్నేహితురాళ్లు, ఇకపై అతన్ని కలవరాదని, లేకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించి వదిలేశారు.

అయినా, సురేష్ తో వృశాలి బంధం తెగలేదు. ఇదే విషయమై స్నేహితురాళ్లతో 23న గొడవ కూడా పడింది. ఆపై హాస్టల్ వదిలి వెళ్లిన వృశాలి, సురేష్ కు విషయం చెప్పింది. తన ఫ్రెండ్స్ ఎక్కడ పోలీసు కేసు పెడతారోనన్న భయంతో వీరిద్దరూ సమీపంలోని రైలు పట్టాలపైకి వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. హాస్టల్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వృశాలి గది నుంచి ఆత్మహత్యకు దారితీసిన కారణాల లేఖను స్వాధీనం చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు.
thane
sucide
nude photos

More Telugu News