కాంగ్రెస్ దారిలోనే టీఆర్ఎస్ కూడా నడుస్తోంది: బీజేపీ నేత లక్ష్మణ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాంగ్రెస్ దారిలోనే టీఆర్ఎస్ కూడా నడుస్తోంది: బీజేపీ నేత లక్ష్మణ్

  • అవినీతి ఊబిలో కూరుకుపోయిన టీఆర్ఎస్ నేతలు
  • అయూబ్ ఖాన్ కు టీఆర్ఎస్ అన్యాయం
  • 'కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ' మా నినాదం
  • ఎంఐఎంకు దమ్ముంటే అన్ని స్థానాల్లో పోటీ చేయాలి
టీఆర్ఎస్ నేతలు అవినీతిలో కూరుకుపోయారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ కొనసాగించిన అవినీతి పాలన బాటలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నడుస్తోందని విమర్శించారు. తెలంగాణ కోసం ఉద్యమించి పోరాడిన అయూబ్ ఖాన్ కు టీఆర్ఎస్ అన్యాయం చేసిందని... దళిత యువకుడు శ్రీనివాస్ టీఆర్ఎస్ నేతల అవినీతికి బలయ్యాడని మండిపడ్డారు.

'కాంగ్రెస్ ముక్త్ భారత్.. బీజేపీ యుక్త్ భారత్' నినాదంలో భాగంగా తాము కూడా 'కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ' నినాదాన్ని చేపట్టనున్నట్టు లక్ష్మణ్ తెలిపారు. ఎంఐఎం నేతలకు నిజంగా దమ్ముంటే రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ, 17 లోక్ సభ స్థానాలకు పోటీ చేయాలని సవాల్ విసిరారు. సామాజిక తెలంగాణ కోసం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
bjp
telangana bjp
TRS
mim
bjp lakshman

More Telugu News