సెహ్వాగ్ కు అతి ఖరీదైన కానుకను ఇచ్చిన టెండూల్కర్!
- సెహ్వాగ్ కు బీఎండబ్ల్యూ కారును బహూకరించిన సచిన్
- కారు ఖరీదు రూ. 1.14 కోట్లు
- థాంక్యూ పాజీ అంటూ ధన్యవాదాలు తెలిపిన సెహ్వాగ్
ఈ సందర్భంగా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు సెహ్వాగ్. తనకు బహుమతిని ఇచ్చిన సచిన్ కు ధన్యవాదాలు తెలిపాడు. "థాంక్యూ సచిన్ పాజీ" అంటూ ట్వీట్ చేశాడు. ఓపెనర్లుగా వీరిద్దరూ కలసి భారత్ కు ఎన్నో ఘన విజయాలను అందించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ నుంచి సెహ్వాగ్ రిటైర్ అయిన సందర్భంలో.. 'సెహ్వాగ్ ఓ నిజమైన ఛాంపియన్' అంటూ సచిన్ కొనియాడాడు. సెహ్వాగ్ కూడా సచిన్ ను క్రికెట్ దేవుడిగానే భావిస్తుంటాడు. సచినే తనకు స్ఫూర్తి అంటూ సెహ్వాగ్ పలు సందర్భాల్లో చెప్పాడు.