క్రికెట్ దిగ్గజం నుంచి హార్దిక్ పాండ్యకు ఊహించని కితాబు!
- పాండ్య నా కంటే ప్రతిభావంతుడు
- అతను జట్టులో కీలకంగా మారే అవకాశం ఉంది
- అయితే పాండ్య చాలా కష్టపడాలి
- అలా కష్టపడితే ఎన్నో ఘనతలు అందుకుంటాడంటున్న కపిల్
ఇక ఈ మధ్య కాలంలో హార్దిక్ పాండ్య ఆటతీరుతో అందరి ప్రశంసలు పొందుతున్నాడు. దీంతో పలువురి నోట కపిల్ దేవ్ లాంటి ఆల్ రౌండర్ టీమిండియాకు దొరికాడంటూ ప్రశంసలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్య గురించి దిగ్గజం కపిల్ దేవ్ స్పందించాడు. పాండ్య తనకంటే ప్రతిభావంతుడైన క్రికెటర్ అని అన్నాడు. అతనికి ఉన్న ప్రతిభ, సామర్థ్యంతో టీమిండియాకు మరింత కీలకంగా మారే అవకాశం ఉందని ఆయన చెప్పాడు. అయితే అందుకు పాండ్య చేయాల్సిందల్లా కష్టపడడమేనని ఆయన సూచించారు. అలా చేస్తే అతను జట్టులో కీలకమవుతాడని, ఎన్నో ఘనతలు అందుకుంటాడని కపిల్ ఆశీర్వదించాడు. ఈ ప్రశంసలు పాండ్యలో మరింత స్పూర్తిని పెంచుతాయని చెప్పచ్చు.