Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమెరికన్ టీవీ సీరియల్ లో అమీ జాక్సన్!

  • హాలీవుడ్ తెరంగేట్రం చేయనున్న అమీ జాక్సన్
  • ‘సూపర్‌ గాళ్‌’ టీవీ సిరీస్ లో నటించిన అమీ జాక్సన్
  • ‘సాటర్న్‌ గాళ్‌’ పాత్రలో నటించిన అమీ
'స్లమ్ డాగ్ మిలియనీర్' సినిమాతో ఫ్రిదా పింటో, ‘క్వాంటికో’, 'బేవాచ్'తో ప్రియాంకా చోప్రా, 'ట్రిపుల్ ఎక్స్: జాండర్ కేజ్' సినిమాతో దీపికా పదుకునే హాలీవుడ్ లో సత్తాచాటారు. ఇప్పుడు తాజాగా మరో బాలీవుడ్ భామ హాలీవుడ్ లో సత్తా చాటడానికి అడుగులు వేస్తోంది. బ్రిటన్ కు చెందిన అమీ జాక్సన్‌ అమెరికన్ డబ్ల్యూ టీవీ సీరియల్ ‘సూపర్‌ గాళ్‌’లో నటించింది. ఈ సీరియల్ వచ్చే నెల 9వ తేదీ నుంచి అక్కడ ప్రసారం కానుంది.

బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లలో పలు సినిమాల్లో నటించిన అమీ మంచి పేరుతెచ్చుకుంది. ఈ సిరీస్ లో ‘సాటర్న్‌ గాళ్‌’ గా కనిపించనున్న అమీకి భారత్ లో ఉన్న ఫాలోయింగ్ కారణంగా అవకాశం వచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం అమీ చేతిలో ‌తమిళ ‘క్వీన్‌’, కన్నడ ‘విలన్‌’ రజనీకాంత్‌ ‘2.0’ సినిమాలున్నాయి. 
amy Jackson
super girl
Saturn girl
tv series

More Telugu News