అమెరికా విమానాలను ఉత్తర కొరియా చూసుంటే... ఏం జరిగి ఉండేదో ఊహించలేమన్న దక్షిణ కొరియా

గత వారాంతంలో అమెరికా తన యుద్ధ విమానాలను కొరియా సరిహద్దుల్లోని తూర్పు తీరానికి పంపిన సంగతి తెలిసిందే. ఐక్యరాజ్యసమితి వేదికపై ఉత్తర కొరియా ప్రతినిధి మాట్లాడుతున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. దీనిపై తాజాగా దక్షిణ కొరియా ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పింది. తమ దేశానికి దగ్గరగా వచ్చి, తీరంపై ఎగురుతున్న యుద్ధ విమానాలను ఉత్తర కొరియా గుర్తించలేకపోయిందని, ఆ దేశపు నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైందని దక్షిణ కొరియా వార్తా సంస్థలు పేర్కొన్నాయి.

ఒకవేళ ఈ యుద్ధ విమానాలను ఉత్తర కొరియా గమనించి ఉంటే ఏం జరిగి ఉండేదో ఊహించలేక పోతున్నామని పేర్కొన్నాయి. ఆ విమానాలను కొరియా సైన్యం, నిఘా వ్యవస్థ గమనించి ఉంటే కచ్చితంగా దాడి చేసి ఉండేవారని అంచనా వేశాయి. కిమ్ జాంగ్ నిఘా వ్యవస్థ బలం ఎంతన్నది ఈ సంఘటనతోనే ప్రపంచానికి తెలిసిందని ఎద్దేవా చేశాయి.

కాగా, దక్షిణ కొరియా చేసిన వ్యాఖ్యలను ఉత్తర కొరియా ఖండించింది. విమానాలు తమ తీరం వైపుగా వచ్చిన సంగతి తమకు తెలుసునని, కొరియా ప్రాదేశిక జలాల్లోకి అవి రాలేదని, వస్తే తమ సత్తా చూపుండేవాళ్లమని ఆ దేశ విదేశాంగ మంత్రి వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
north korea
US bombers
south korea
kim jong un

More Telugu News