- పడిపోయిన షుగర్ లెవల్స్
- వాహన సేవలకు దూరం
- అవసరమైతే ఆసుపత్రికి తరలింపు
తిరుమల మాజీ పేష్కార్, వీఐపీలు వచ్చినప్పుడు ముందుండి వారికి అతిథి మర్యాదలు చేస్తూ, మీడియాలో కనిపిస్తుండే డాలర్ శేషాద్రి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. శేషాద్రి సొమ్మసిల్లి పడిపోవడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గత నాలుగు రోజులుగా తిరుమలలో జరుగుతున్న వాహన సేవల్లో పాల్గొంటున్న ఆయన, సమయానికి సరిగ్గా తినక పోవడం వల్ల షుగర్ లెవల్స్ కనిష్ఠానికి చేరాయని, ఈ కారణంగా ఆయన సొమ్మసిల్లి పడిపోయారని వెల్లడించిన వైద్యులు, ఇంట్లోనే చికిత్స అందిస్తున్నారు.
కొన్ని రోజుల పాటు ఆయనకు విశ్రాంతి అవసరమని తెలిపారు. ఆయన ఆరోగ్యాన్ని గమనిస్తున్నామని, అవసరమైతే ఆసుపత్రికి తరలిస్తామని చెప్పారు. అస్వస్థత కారణంగా ఆయన నిన్న జరిగిన సర్వభూపాల వాహన సేవలో కనిపించలేదు. నేడు జరిగే గరుడసేవలోనూ ఆయన పాల్గొనే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని తెలుస్తోంది.