ప్రియాంక చోప్రా: న్యూయార్క్ లో బాలీవుడ్ బ్యూటీని కలిసిన దక్షిణాది ముద్దుగుమ్మ
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాను దక్షిణాది ముద్దుగుమ్మ నయనతార కలిసింది. ‘గ్లోబల్ గోల్స్ అవార్డ్’ స్వీకరణ నిమిత్తం ప్రియాంక చోప్రా ఇటీవలే న్యూయార్క్ వెళ్లింది. మరోపక్క, తన ప్రియుడు విగ్నేశ్ శివన్ తో కలిసి నయనతార కూడా న్యూయార్క్ వెళ్లింది. దీంతో, న్యూయార్క్ లో ఉన్న ప్రియాంకను నయనతార కలిసింది.
అమెరికాలో జీవన విధానంతో పాటు పలు అంశాలపై వీరిద్దరు మాట్లాడుకున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా, నయనతార కలిసి దిగిన ఓ ఫొటో సామాజిక మాధ్యమాలకు చేరి, వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా, నయనతార ప్రియుడు విగ్నేశ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ న్యూయార్క్ లో జరుపుకున్నాడు.