బాలీవుడ్ స్టార్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్
- వివాదాలతో సావాసం చేసే కంగనా రనౌత్
- స్టార్ హీరోలను టార్గెట్ చేసిన కంగనా
- కొడుకులను హీరోలుగా చేసేందుకు నానా పాట్లు పడే హీరోలు కుమార్తెల విషయంలో ఆలోచిస్తారు
- అందరు హీరోలు అలా లేరు
అలాగే తమ కొడుకులను హీరోలుగా నిలబెట్టేందుకు పడరాని పాట్లుపడే హీరోలు, తమ కూతుళ్లను హీరోయిన్లను చేయాలంటే పదిసార్లు ఆలోచిస్తారని ఎద్దేవా చేసింది. అయితే అందరు హీరోలు అలా లేరని తెలిపింది. తన కుమార్తె బికినీ వేస్తే కాళ్లు విరగ్గొడతానని షారూఖ్ పేర్కొనగా, తన కుమార్తె సినిమాల్లో నటిస్తానంటే కాళ్లు విరగ్గొట్టి మూలన కూర్చోబెడతానని సంజయ్ దత్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కంగన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.