Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం!

  • 'సంఘమిత్ర'లో నాయికగా దిశా పఠానీ
  • 'రాజా ది గ్రేట్' బిజినెస్ క్రేజ్ 
  • లావణ్య త్రిపాఠీ చిరకాల కోరిక 
  • విజయదశమికి 'బాలకృష్ణుడు' టీజర్  
*  సుందర్ సి. దర్శకత్వంలో తమిళంలో భారీ బడ్జెట్టుతో 'సంఘమిత్ర' పేరిట ఓ చిత్రం రూపొందనున్న సంగతి విదితమే. ఇందులో మొదట కథానాయికగా ఎంపికైన శ్రుతి హాసన్ ప్రాజక్టు నుంచి తప్పుకున్నాక, ఆ పాత్ర కోసం చాలామందిని సంప్రదించారు. తాజాగా దిశా పఠానీని ఎంచుకున్నట్టు సమాచారం.
*  రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'రాజా ది గ్రేట్' చిత్రానికి ట్రేడ్ వర్గాలలో మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో శాటిలైట్, డిజిటల్, హిందీ డబ్బింగ్ హక్కుల రూపంలో చిత్ర నిర్మాతలకు సుమారు 18 కోట్ల వరకు వచ్చినట్టు చెబుతున్నారు. వచ్చే నెల 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు.
*  తెలుగు, తమిళ సినిమాలలో ప్రస్తుతం బిజీగా వున్న లావణ్య త్రిపాఠీ తన చిరకాల కోరికను నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. హైదరాబాదులో మంచి ఫ్లాట్ కొనుక్కోవాలనేది ఆమె కోరికట. ప్రస్తుతం తాను అదే పనిలో వున్నానని, త్వరలోనే మంచి ఇల్లు కొంటానని చెబుతోంది.
*  నారా రోహిత్ హీరోగా రూపొందుతున్న 'బాలకృష్ణుడు' చిత్రం టీజర్ ను విజయదశమికి విడుదల చేస్తారు. పవన్ మల్లెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రెజీనా కథానాయికగా నటిస్తోంది.   
Disha
regina
rohit

More Telugu News