వాయిదాల పద్ధతిలో విమాన టికెట్ ధర చెల్లింపు... ఇతిహాద్ ఎయిర్లైన్స్ వినూత్న ఆఫర్!
- `ఫ్లై నౌ అండ్ పే లేటర్` పేరిట ఆఫర్
- 3 నుంచి 60 నెలల వాయిదాల్లో డబ్బు చెల్లించే అవకాశం
- మధ్య తరగతి ప్రయాణికులను ఆకర్షించే ప్రయత్నం
- ప్రస్తుతం యూఏఈ, సౌదీ అరేబియా, ఈజిప్టు ప్రజలకు మాత్రమే ఆఫర్
`ఫ్లై నౌ అండ్ పే లేటర్` పేరిట విమాన టికెట్ డబ్బును వాయిదాల పద్ధతిలో చెల్లించే అవకాశాన్ని కల్పించింది. దీని ద్వారా టికెట్ డబ్బును 3 నుంచి 60 నెలల వాయిదాల్లో చెల్లించుకునే సదుపాయం కల్పించింది. ఇందుకోసం టికెట్ బుక్ చేసుకునేటపుడు ‘పే బై ఇన్స్టాల్మెంట్’ ఆప్షన్ను ఎంచుకుని క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. విమాన ప్రయాణాన్ని మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులోకి తీసుకురావడానికే ఈ ఆఫర్ ప్రవేశపెట్టినట్లు ఇతిహాద్ ఎయిర్లైన్స్ వైస్ ప్రెసిడెంట్ జస్టిన్ వార్బీ తెలిపారు. ప్రసుత్తం ఈ ఆఫర్ యూఏఈ, సౌదీ అరేబియా, ఈజిప్టు ప్రజలకు మాత్రమే వర్తించనున్నట్లు ఆయన వివరించారు.