Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

క‌పిల్ దేవ్ పాత్ర‌లో అర్జున్ క‌పూర్‌?

బాలీవుడ్ ఫిల్మ్‌మేక‌ర్ క‌బీర్ ఖాన్ దృష్టి 1983లో భార‌త క్రికెట్ జ‌ట్టు సాధించిన ప్ర‌పంచ‌క‌ప్ మీద ప‌డింది. క‌పిల్ దేవ్ సార‌థ్యంలో ఇంగ్లండ్ జ‌ట్టుతో పోరాడి భార‌త్ జ‌ట్టు ప్ర‌పంచ క‌ప్ గెల్చుకుంది. దీని ఆధారంగా త్వ‌ర‌లో ఓ సినిమాను తెరకెక్కించ‌డానికి క‌బీర్ ఖాన్ యోచిస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమాకు `వ‌ర‌ల్డ్ క‌ప్ 1983` అని పేరు కూడా ఖరారు చేసిన‌ట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్ర‌ కోసం అర్జున్ క‌పూర్, ర‌ణ్‌వీర్ సింగ్, హృతిక్ రోష‌న్‌ల‌ను నిర్మాత‌లు సంప్ర‌దించిన‌ట్లు, చివరికి అర్జున్ కపూర్ ఎంపిక అయ్యే అవకాశాలు ఎక్కువగా వున్నట్టు సమాచారం. జాతీయ అవార్డు గ్ర‌హీత ద‌ర్శ‌కుడు సంజ‌య్ పూర‌న్ సింగ్ చౌహాన్ ఈ చిత్రానికి క‌థ అందించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాలను సెప్టెంబ‌ర్ 27న ఓ వేడుక నిర్వ‌హించి తెలియ‌జేయ‌నున్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ వేడుక‌కు ఆనాటి వ‌రల్డ్ క‌ప్ ఆడిన క్రికెట‌ర్ల‌తో పాటు ఇత‌ర ప్ర‌ముఖులు కూడా హాజ‌రవుతున్న‌ట్లు స‌మాచారం.
kapil dev
arjun kapoor
1983 world cup
kabir khan

More Telugu News