తొలి రోజున 'జై లవ కుశ' మొత్తం వసూళ్లు!
- 'జై లవ కుశ'కు భారీ ఓపెనింగ్స్
- తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు షేర్ 21.86 కోట్లు
- తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు గ్రాస్ 32 కోట్లు
- తొలి రోజు వరల్డ్ వైడ్ షేర్ 29. 28 కోట్లు
తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున ఈ సినిమా 21.86 కోట్ల షేర్ ను సాధించి, 32 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే 29.28 కోట్ల షేర్ ను రాబట్టింది. తొలి సారిగా ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయడం ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలిచింది. ఈ మూడు పాత్రల మధ్య గల వేరియేషన్స్ ను ఎన్టీఆర్ అద్భుతంగా పండించడం .. ఆ పాత్రల స్వభావాలను దృష్టిలో పెట్టుకుని దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ ను కంపోజ్ చేయడం ఈ సినిమాకి బాగా కలిసొచ్చిందని అంటున్నారు. శని .. ఆదివారాల్లో వసూళ్లు మరింత ఊపందుకోవడం ఖాయమని చెబుతున్నారు.