'ఆక్సిజన్' రిలీజ్ మరింత ఆలస్యం .. మళ్లీ వాయిదా!
- గోపీచంద్ తదుపరి చిత్రంగా 'ఆక్సిజన్'
- ఇప్పటికే పలుమార్లు వాయిదా
- అక్టోబర్ 27న అంటూ తాజా ప్రకటన
- కథానాయికలుగా రాశి ఖన్నా .. అనూ ఇమ్మాన్యుయేల్
అక్టోబర్ 12 న విడుదల చేయాలనే ఆలోచనలో వున్నట్టుగా చెప్పారు .. ఆ తరువాత అక్టోబర్ 17కి వెళ్లారు. ఇక ఇప్పుడు అక్టోబర్ 27ను విడుదల తేదీగా ఫిక్స్ చేశారనేది తాజా సమాచారం. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా కోసం గోపీచంద్ అభిమానులంతా కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే విడుదల తేదీలను పదే పదే మారుస్తూ ఉండటమే వాళ్లకి అసహనాన్ని కలిగిస్తోంది. ఇలా విడుదల తేదీలను మాటిమాటికి మార్చడం మంచిది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.