'సైరా' ఆలస్యం కావడానికి కారణాలు ఇవే!
- 'రంగస్థలం' షూటింగ్ పూర్తి చేయనున్న చరణ్
- ఆ తరువాతనే 'సైరా'పై పూర్తి స్థాయి పర్యవేక్షణ
- 'సైరా' కోసం భారీ సెట్స్ నిర్మాణం కొనసాగుతోంది
- ముఖ్యమైన పాత్రలను చేసే నటీనటులు ప్రస్తుతం బిజీగా వున్నారు
'సైరా' కోసం హైదరాబాద్ .. జైపూర్ లలో భారీ సెట్స్ నిర్మాణం జరుగుతోంది. వాటి నిర్మాణం పూర్తి కావడానికి కొంత సమయం పట్టనుంది. ఇక ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషించనున్న నయనతార .. అమితాబ్ .. జగపతి .. విజయ్ సేతుపతి .. సుదీప్ ఇలా అంతా కూడా వేరే ప్రాజెక్టులతో బిజీగా వున్నారు. అవి పూర్తి చేసుకుని వాళ్లు రావడానికి సమయం పడుతుంది. మొత్తం మీద అక్టోబర్ చివర్లో తప్పకుండా సెట్స్ పైకి వెళ్లాలనే ఆలోచనలో వున్నారు.