ఇది రియల్‌లైఫ్ `మనం` సెల్ఫీ!
తాత అక్కినేని నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫొటో దగ్గర దిగిన ఈ సెల్ఫీని నెటిజన్లు తెగపొగిడేస్తున్నారు. కాకపోతే ఈ రియల్ లైఫ్ సెల్ఫీలో నాగేశ్వరరావు ఫొటో మాత్రమే ఉండటం కొంత వెలితిగా అనిపిస్తోంది. మరో విషయం ఏంటంటే.. ఒక్కసారిగా మీసాలు లేకుండా నాగార్జున, పూర్తి గడ్డం, మీసాలతో నాగచైతన్య, అఖిల్ ఈ ఫొటోలో ఉండటంతో `కుమారుల కంటే తండ్రి యంగ్‌గా కనిపిస్తున్నాడు` అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్ చేశారు.