భయం గుప్పిట్లో ఆంధ్ర-ఒడిశా సరిహద్దు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలంటూ నేతలకు నోటీసులు
- ఏవోబీలో మావోస్టుల వార్షికోత్సవాలు
- జల్లెడ పడుతున్న పోలీసు బలగాలు
- కొనసాగుతున్న వాహనాల తనిఖీలు
- ప్రభుత్వ కార్యాలయాలకు భద్రత
జోలాపుట్టు, కుమడ, డుడుమ తదితర ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు కొనసాగాయి. ప్రభుత్వ కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. మావోయిస్టు హిట్ లిస్టులో ఉన్న ప్రజాప్రతినిధులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో, ఎప్పుడు ఏం జరుగుతుందోనని గిరిజనులు భయాందోళనలకు గురవుతున్నారు.