'రంగస్థలం' సెట్స్ కి రాజమౌళితో చిరంజీవి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'రంగస్థలం' సెట్స్ కి రాజమౌళితో చిరంజీవి!

  • వేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న 'రంగస్థలం'
  •  రాజమౌళితో కలిసి సెట్స్ కి వెళ్లిన చిరంజీవి 
  •  యూనిట్ సభ్యుల్లో కొత్త ఉత్సాహం
  •  రాజమౌళి తదుపరి సినిమా చరణ్ తోనేననే టాక్    
చరణ్ .. సుకుమార్ కాంబినేషన్లో 'రంగస్థలం 1985' సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఇక్కడ వేసిన పల్లెటూరి సెట్లో ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన సన్నివేశాలను సుకుమార్ చిత్రీకరిస్తూ ఉండగా, చిరంజీవి .. రాజమౌళి కలిసి అక్కడికి వచ్చారు. హఠాత్తుగా వాళ్లు అలా విజిట్ చేయడంతో యూనిట్ సభ్యులు ఆనందాశ్చర్యాలకు లోనయ్యారు.

యూనిట్ సభ్యులందరినీ విష్ చేసిన చిరంజీవి .. రాజమౌళి, చరణ్ .. సుకుమార్ లతో కలిసి కాసేపు ముచ్చటించారు. ఈ సినిమా ప్రోగ్రెస్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఇటీవల మెగా క్యాంపుకి రాజమౌళి చేరువవుతున్నాడనే ప్రచారం జోరుగా జరుగుతోన్న సమయంలోనే, వాళ్లిద్దరూ కలిసి ఈ సినిమా సెట్స్ కి రావడం విశేషం. రాజమౌళి తదుపరి సినిమా చరణ్ తో ఉండొచ్చుననే వార్తలకి ఈ సంఘటన మరింత బలాన్ని చేకూర్చుతోంది.  
chiru
rajamouli

More Telugu News