వైజాగ్ టూ హైదరాబాద్ రూ. 1249... ఇండిగో సూపర్ ఆఫర్ల వివరాలివి!

  • దాదాపు గరుడా సర్వీస్ ధరకు విమాన ప్రయాణం
  • 12 గంటల పాటు సమయం ఆదా
  • ఇండిగో వెబ్ సైట్లో ఇంకా లభిస్తున్న చౌక ధర
దేశవాళీ విమాన ప్రయాణ టికెట్లలో లోకాస్ట్ సేవల సంస్థ ఇండిగో బంపరాఫర్లను ప్రకటించింది. పలు గమ్యస్థానాల నడుమ 1,099 నుంచి టికెట్లను అందుబాటులో ఉంచింది. ఢిల్లీ - జైపూర్ రూట్ లో ఈ ధర వర్తిస్తుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక చెన్నై - బెంగళూరు మధ్య రూ. 1,120, జమ్మూ - శ్రీనగర్ మధ్య రూ. 1,168, వడోదరా - గౌహతీ మధ్య రూ. 1,227, వైజాగ్ - హైదరాబాద్ మధ్య రూ. 1,249, అగర్తలా - గౌహతీ మధ్య రూ. 1,249, బెంగళూరు - చెన్నై మధ్య రూ. 1,285, గోవా - బెంగళూరు మధ్య రూ. 1,316 టికెట్లను అందుబాటులోకి ఉంచినట్టు పేర్కొంది.

ఇక 'ఏపీ 7 ఏఎమ్' టీమ్ ఇండిగో వెబ్ సైట్ లో ఈ ధరపై టికెట్ల గురించి వెతుకగా, వచ్చే నెలలో రూ. 1,249 ధరపై విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు టికెట్లు అందుబాటులో ఉన్నాయి. అక్టోబర్ 11, 12, 15, 17, 19, 27, 29, 31 తేదీల్లో చౌక ధరకు టికెట్లు ఉన్నాయి. మామూలుగా అయితే, ఈ రెండు నగరాల మధ్యా సూపర్ లగ్జరీ బస్సు టికెట్ రూ. 746 కాగా, ప్రయాణ సమయం 14 గంటలు. ఇక గరుడా ప్లస్ సర్వీస్ అయితే, రూ. 1,171 టికెట్ ధర కాగా, 12 గంటల సమయం పడుతుంది. ముందుగా ప్లాన్ చేసుకుంటే ఈ మార్గంలో గంటన్నర వ్యవధిలో గమ్యస్థానానికి చేర్చే విమాన ప్రయాణానికి మరో మరో 100 రూపాయలు కేటాయిస్తే సరిపోతుంది.
Go Back to Shorts
indigo
goindigo
vizag
hyderabad

More Telugu News