ఫుట్‌బాల్ మ్యాచ్‌కు భంగం క‌లిగించిన పెంపుడు కుక్క.... వీడియో చూడండి

ఫుట్‌బాల్ మ్యాచ్ జ‌రుగుతుండ‌గా ఓ పెంపుడు కుక్క స్టేడియంలోకి వ‌చ్చిన సంఘ‌ట‌న అర్జెంటీనాలో జ‌రిగింది. సాన్ లొరెంజో, ఆర్సెలాన్ జ‌ట్ల మ‌ధ్య ఉత్కంఠ‌గా జరుగుతున్న మ్యాచ్‌లో ఓ చిన్న పెంపుడు కుక్క వ‌చ్చి ఫుట్‌బాల్‌తో ఆడ‌టం మొద‌లుపెట్టింది. ఆట‌గాళ్లు ఎంత వారించినా అది అక్క‌డి నుంచి వెళ్ల‌కపోవ‌డంతో వారు కూడా దాంతో ఆడ‌టం మొద‌లుపెట్టారు. చివ‌రికి దానికి మ‌రో ఫుట్‌బాల్ చూపించి, మీడియా పాయింట్ నుంచి మైదానం బ‌య‌టికి తీసుకెళ్లారు. అక్క‌డ కూడా మైక్‌ను కొరుకుతూ కుక్క చేసిన అల్ల‌రి అంద‌రికీ న‌వ్వు తెప్పిస్తోంది. కుక్క అల్ల‌రి వీడియో అర్జెంటీనా టీవీ ఛాన‌ల్ టీవైసీ స్పోర్ట్స్ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. ఇప్ప‌టికి ఈ వీడియోకు దాదాపు 9000ల రీట్వీట్లు వ‌చ్చాయి.
Go Back to Shorts
football
dog
puppy
argentina
match disrupt
video
viral video

More Telugu News