Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆర్‌కే స్టూడియో ద‌గ్ధం గురించి వ‌చ్చిన కార్టూన్‌పై మండిప‌డ్డ రిషి క‌పూర్‌!

ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో ఉన్న ఆర్‌కే స్టూడియోలో ఇటీవ‌ల జ‌రిగిన అగ్ని ప్ర‌మాదం గురించి ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక‌లో వ‌చ్చిన కార్టూన్‌పై న‌టుడు రిషి క‌పూర్ మండిప‌డ్డారు. ఇలాంటి చౌకబారు హాస్యంపై తాము అభ్యంతరం వ్యక్తం చేస్తామని ఆయ‌న ట్వీట్ చేశారు. ఆ కార్టూన్‌లో ఆర్‌కే స్టూడియో ద‌గ్ధ‌మ‌వుతుండగా పై నుంచి రాజ్ క‌పూర్ చూస్తూ `అగ్ని మంచి సంకేత‌మే.. నా జీవితం మ‌లుపు తిరిగిందే.. ఆగ్ (అగ్ని) వ‌ల్ల‌` అంటున్న‌ట్లుగా చూపించారు.

రాజ్ క‌పూర్ సొంత స్టూడియో ఆర్కే ఫిలిమ్స్ ఆయన దర్శకత్వంలో నిర్మించిన మొద‌టి సినిమా `ఆగ్ (అగ్ని)`. ఇలా ఓ ప్ర‌మాదాన్ని చూసి రాజ్‌క‌పూర్ న‌వ్వుతున్న‌ట్లుగా చూపించ‌డాన్ని రిషి క‌పూర్ ఖండించారు. ప్ర‌మాదం జ‌రిగిన రోజు కూడా ఆయ‌న ట్వీట్లు చేశారు. `ఆర్‌కే స్టూడియోలో అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. చారిత్రాత్మ‌క స్టేజీ 1 నాశ‌న‌మైంది. అదృష్ట‌వ‌శాత్తు ఎవ‌రికీ ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేదు` అని ట్వీట్ చేశారు. అలాగే `కావాల‌నుకుంటే మ‌ళ్లీ స్టూడియోను నిర్మించుకోవ‌చ్చు. కానీ దానితో ఉన్న జ్ఞాప‌కాల‌ను తిరిగి తీసుకురాలేం` అని రిషిక‌పూర్ మ‌రో ట్వీట్ చేశారు.
rk studio
rishi kapoor
raj kapoor
fire accident
cartoon

More Telugu News