Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లైన్లో నిల‌బ‌డలేని వారి కోసమే ఈ యాప్‌... సింగ‌పూర్‌లో బాగా ఫేమ‌స్‌

సాధార‌ణంగా టిక్కెట్ల కోసం, బుకింగ్‌ల కోసం గంట‌ల త‌ర‌బ‌డి లైన్లో నిల‌బ‌డాలంటే ఎవ‌రికైనా చిరాకే... అలాంటి వారి కోసం సింగ‌పూర్‌కి చెందిన స్టార్ట‌ప్ కంపెనీ ఓ యాప్ త‌యారుచేసింది. `ఐక్యూ (iQueue)` అని పిలిచే యాప్ ద్వారా లైన్లో నిల‌బ‌డ‌లేని వారు, వారి స్థానంలో మ‌రొక‌రిని నిల‌బెట్టొచ్చు. కాకపోతే వారికి కొంత డ‌బ్బు చెల్లించాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం ఈ యాప్ సింగ‌పూర్‌లో బాగా ప్రాచుర్యాన్ని సంపాదించుకుంది.

ముఖ్య‌విష‌యం ఏంటంటే... ఇది కేవ‌లం ఐఫోన్ వినియోగ‌దారుల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉంది. అంతేకాదు... లైన్లో నిల‌బ‌డాల్సిన స‌మ‌యం ఆధారంగా ఐక్యూ కంపెనీ వారు ప్ర‌త్యేక ప్యాకేజీల‌ను కూడా ప్రవేశ‌పెట్టారు. గంట‌కు 20 సింగ‌పూర్ డాల‌ర్లు, మూడు గంట‌ల‌కు 35 సింగ‌పూర్ డాల‌ర్లు వంటి ప్యాకేజీలు ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్నాయి. అలాగే వ‌రుసలో నిల్చున్న త‌ర్వాత అక్క‌డి నుంచి ప్ర‌తి 15 నిమిషాల‌కు ఒక‌సారి లైవ్ అప్‌డేట్ల‌ను కూడా యాప్ ద్వారా తెలుసుకునే స‌దుపాయం ఉంది.
smart world
iQueue
app
singapore

More Telugu News