'స్పైడర్' సెన్సార్ టాక్... సినిమా సూపర్ హిట్టే!

టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 'స్పైడర్' సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ వచ్చిందని చిత్రయూనిట్ తెలిపింది. ఈ సినిమా విడుదలకు ముందే టాక్ బయటకు వచ్చేసింది. సెన్సార్ సందర్భంగా ఈ సినిమాను చూసిన సభ్యులు, చిత్రయూనిట్ ను అభినందించారట. మహేష్ బాబు ఖాతాలో మరో సూపర్ హిట్ వచ్చి చేరిందని పేర్కొన్నారట. ప్రధానంగా యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయని కితాబునిచ్చారట.

సెన్సార్ సభ్యుల నుంచి ఈ మాటలు విన్న చిత్రయూనిట్ విజయంపై మరింత ధీమాగా ఉందని ఫిల్మ్ నగర్ టాక్. సినిమా విడుదలకు ముందే పాజిటివ్ టాక్ రావడంతో మహేష్ బాబు అభిమానులు ఆనందంగా ఉన్నారు. 'స్పైడర్' సినిమాకు మురుగదాస్ దర్శకత్వం వహించగా, మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. ఈ సినిమాలో ప్రతి నాయకులుగా తమిళ నటులు ఎస్.జే. సూర్య, 'ప్రేమిస్తే' ఫేం భరత్ నటించడం విశేషం. 

spaider
maheshbabu
murugadas
rakul preet singh
spaider movie

More Telugu News