కొంచెం ఆలస్యంగానే అభిమానుల ముందుకు సూర్య!

  •  విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో సూర్య
  •  కథానాయికగా కీర్తి సురేశ్
  •  అక్టోబర్ నుంచి జనవరికి వాయిదా
  •  తెలుగు ప్రేక్షకుల ముందుకు ఆలస్యంగా
సూర్య తాజా చిత్రంగా 'తానా సెరిందా కూట్టమ్' తెరకెక్కుతోంది. కథానాయకుడిగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సూర్యకు ఇది 41వ చిత్రం. ఈ సినిమాలో ఆయన సరసన కీర్తి సురేశ్ నటిస్తోంది.  విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దీపావళి కానుకగా అక్టోబర్లో విడుదల చేయాలనుకున్నారు. కానీ దీపావళికి అక్కడ గట్టిపోటీ ఉండటంతో, జనవరిలో రిలీజ్ చేయడమే మంచిదని భావిస్తున్నారు.

 సాధారణంగా సూర్య సినిమాలు తమిళంతో పాటు తెలుగులోను విడుదలవుతుంటాయి. అయితే సంక్రాంతికి ఇక్కడ పెద్ద సినిమాలు రంగంలోకి దిగుతున్నాయి. అందువలన ముందుగా తమిళంలో ఈ సినిమాను రిలీజ్ చేసి, తెలుగులో కాస్త ఆలస్యంగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. 'సింగం 3' సినిమా విషయంలో ఆశించినస్థాయి హిట్ ను అందుకోలేకపోయిన సూర్య, ఈ సినిమాతో హిట్ కొడతాడేమో చూడాలి.               
Go Back to Shorts
surya
keerti suresh

More Telugu News