న్యూయార్క్ లో విఘ్నేశ్ శివన్ తో నయనతార షికారు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

న్యూయార్క్ లో విఘ్నేశ్ శివన్ తో నయనతార షికారు

  •  తెరపైకి మళ్లీ విఘ్నేష్, నయన్ ల ప్రేమ వ్యవహారం
  •  న్యూయార్క్ వీధుల్లో జంట షికారు
  •  త్వరలో పెళ్లి కబురు చెప్పేస్తారనే టాక్       
శింబు .. ప్రభుదేవాల తరువాత దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో నయనతార ప్రేమలో పడినట్టుగా వార్తలు వచ్చాయి. అవార్డుల ఫంక్షన్ కి ఇద్దరూ కలిసి వెళ్లడం .. అప్పుడప్పుడు ఇద్దరూ విదేశాలు చుట్టిరావడం ఈ వార్తలకు బలాన్ని చేకూర్చింది. ఇక విఘ్నేశ్ కి నయనతార ఖరీదైన ఓ కారును గిఫ్ట్ గా ఇచ్చిందనీ .. తన కుటుంబ సభ్యులకు ఆయనను పరిచయం చేసిందనే వార్తలు కూడా వచ్చాయి.

 ఇక ఈ ఇద్దరూ న్యూయార్క్ వీధుల్లో షికారు చేస్తూ, అందుకు సంబంధించిన ఫోటోలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి తమ ప్రేమ వ్యవహారాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు. తమ గురించి అంతా మాట్లాడుకునేలా చేశారు. విఘ్నేశ్ శివన్ బర్త్ డే వేడుకను సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఈ జంట న్యూయార్క్ వెళ్లినట్టు తెలుస్తోంది. చూడబోతే త్వరలోనే పెళ్లి కబురు చెప్పేలా వున్నారనే టాక్ కోలీవుడ్ లో వినిపిస్తోంది.      
nayanatara
vighnesh

More Telugu News