Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కనిపించకుండా పోయిన డిస్కో శాంతి మేనకోడలు ఆచూకీ లభ్యం!

  • 6వ తేదీన తప్పిపోయిన డిస్కో శాంతి మేన కోడలు
  • తమ వంతు ప్రయత్నాలు చేసిన సినీ ప్రముఖులు
  • అమ్మాయి దొరికిందంటూ కార్తీ ట్వీట్
ప్రముఖ నటి డిస్కో శాంతి మేనకోడలు అబ్రిన్ (17) గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. అయితే, ఆమె ఆచూకీ తాజాగా తెలిసింది. ఈ విషయాన్ని కోలీవుడ్ నటుడు కార్తీ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. గత రాత్రి ఆమె ఆచూకీ కనుగొన్నామని చెప్పాడు. ఆమెను గాలించడానికి సహకరించిన బెంగళూరులోని వాలంటీర్లకు, తమిళనాడు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.

సెప్టెంబర్ 6న పాఠశాలకు వెళ్లిన అబ్రిన్ మళ్లీ తిరిగి రాలేదు. దీంతో, ఆమె కుటుంబ సభ్యులు చెన్నైలోని టీనగర్ పాండిబజార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమ చిన్నారి ఆచూకీ కనుక్కునేందుకు సీనీ రంగంలోని వారు కూడా సహకరించాలని డిస్కో శాంతి, ఆమె సోదరి లలిత కుమారి విన్నవించారు. వారికి సాయం చేసేందుకు నడిగర్ సంఘం ముందుకు వచ్చింది. సినీ ప్రముఖులు అబ్రిన్ మిస్ అయిన విషయాన్ని, ఆమె ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
disco shanti
abrin
nadigar sangham

More Telugu News