అందుకే రెమ్యునరేషన్ తీసుకోలేదు : రాశి ఖన్నా
- 'రాజా ది గ్రేట్' లో రాశి ఖన్నా స్పెషల్ సాంగ్
- పారితోషికంగా భారీ మొత్తమే పుచ్చుకుందనే టాక్
- పైసా తీసుకోలేదని చెప్పిన రాశి ఖన్నా
- అక్టోబర్ 12న విడుదల
కాజల్ .. తమన్నా .. కేథరిన్ వంటి కథానాయికలు స్పెషల్ సాంగ్ చేస్తే, భారీ మొత్తాన్నే పారితోషికంగా తీసుకుంటున్నారు. దాంతో రాశి ఖన్నాకు ఎంత ముట్టిందోనని అనుకున్నారు. కానీ ఈ స్పెషల్ సాంగ్ కోసం ఆమె పైసా కూడా తీసుకోలేదనేది తాజా సమాచారం. గతంలో తనకి 'సుప్రీమ్'తో హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడితో గల స్నేహం కారణంగానే తాను ఏమీ తీసుకోలేదని రాశి ఖన్నా చెప్పింది. ఈ స్పెషల్ సాంగ్ లో సాయిధరమ్ తేజ్ కూడా మెరుస్తాడనే టాక్ వినిపిస్తోంది.