suicide: మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం.. ఆత్మహత్య చేసుకుంటున్న తల్లిని కాపాడేందుకు వెళ్లి ముగ్గురు చిన్నారుల మృతి

  • షాక్‌లో గ్రామస్తులు
  • చిన్నారులు ముగ్గురు ఏడేళ్ల లోపు వారే
  • చావుబతుకుల మధ్య తల్లి
మధ్యప్రదేశ్‌లో గుండెలు పిండేసే తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆత్మహత్య చేసుకుంటున్న తల్లిని కాపాడేందుకు వెళ్లిన ఏడేళ్ల లోపు చిన్నారులు ముగ్గురు సజీవ దహనమయ్యారు. రాష్ట్రంలోని దమోలో ఈ ఘటన చోటుచేసుకుంది.  రాణి లోధి (30) తనకు తాను నిప్పంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించగా గమనించిన చిన్నారులు ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో చిన్నారులు ముగ్గురు మృతి చెందగా 70 శాతం గాయాలైన తల్లి జబల్‌పూర్ ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.

చిన్నారులను తుల్సా (2), ముస్కాన్ (5), మాన్సి (7)లుగా గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. కడుపు నొప్పికి తాళలేకే ఆత్మహత్యకు పాల్పడినట్టు రాణి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్టు ఎస్పీ అర్వింద్ దూబే తెలిపారు. అయితే ఇంకేవైనా కారణాలున్నాయోమోనన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
suicide
Madhyapradesh
children
Damoh

More Telugu News