: రెండు చేతులతో బౌలింగ్ వేసే కళను మరోసారి ప్రదర్శించిన అక్షయ్ కార్నెవార్... వీడియో చూడండి!
భారత క్రికెటర్ అక్షయ్ కార్నెవార్ మరోసారి తన సవ్యసాచి బౌలింగ్ కళను ప్రదర్శించాడు. భారత బోర్డ్ ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టు తరఫున ఆడుతున్న అక్షయ్, ఆస్ట్రేలియాతో జరగిన మొదటి వన్డే మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో రెండు చేతులతో బౌలింగ్ చేసి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. ఎడమ చేతి బ్యాట్స్‌మెన్‌లకు కుడి చేతితో, కుడి చేతి ఆటగాళ్లకు ఎడమ చేతితో బౌలింగ్ చేసి ఆటగాళ్లను అయోమయానికి గురిచేశాడు. కార్నెవార్ బౌలింగ్ నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యపోయానని ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ మార్కస్ స్టైనోసిస్ తెలిపాడు. గతేడాది సయ్యద్ ముస్తాఖ్ అలీ ట్రోఫీ మ్యాచుల్లో కూడా కార్నెవర్ తన బౌలింగ్ కళను ప్రదర్శించాడు.