'హలో' మూవీలో మరో హీరోయిన్ కూడా ఉందట!
ఈ సినిమాలో మరో కథానాయిక కూడా వుండనున్నట్టు ఒక టాక్ వినిపిస్తోంది. ఆ కథానాయిక పేరే .. నివేదితా సతీష్. జ్యోతిక ప్రధాన పాత్రను పోషించిన 'మగళిర్ మట్టుమ్' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను ఈ అమ్మాయి పోషించిందట. రెండవ కథానాయికగా ఆమెను ఎంపిక చేసుకున్నారని చెప్పుకుంటున్నారు. ఈ విషయంపై అధికారిక సమాచారం రావలసి వుంది.